- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మనసు లేని మృగం కేసీఆర్’
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పాలన తీరుపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. మనస్సు లేని మృగంలా సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడంటూ మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ఉచితంగా వేయాలన్న డిమాండ్‌తో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నేతలు సోమవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, బ్లాక్‌ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందని, వైద్యం కోసం ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకాను ఉచితంగా వేయాలని, బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో భయంకర పరిస్థితులు ఉన్నాయని, ప్రజలను సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కరోనాతో దెబ్బతిన్న కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభ, మండలిలో కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పామని, సీఎం ఒప్పుకున్నారని, కానీ ఇంకా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదంటూ ఆరోపించారు. ఆ తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంత భయంకర పరిస్థితులకు కారణం సీఎం కేసీఆర్ అని, మృగం మాదిరిగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఎంతమంది చనిపోతున్నా సీఎంకు పట్టింపులేని, ధనిక రాష్ట్రం అని చెప్పి పనికిరాని ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.