గజ్వేల్ సభకు భారీ ఏర్పాట్లు.. ఫుల్ జోష్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు

by Shyam |
గజ్వేల్ సభకు భారీ ఏర్పాట్లు.. ఫుల్ జోష్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు
X

దిశ‌, న‌ర్సాపూర్‌ : ఈ నెల 17న టీపీసీసీ స్టేట్ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించ త‌ల‌పెట్టిన ద‌ళిత, గిరిజ‌న దండోర స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ర్ట నాయ‌కుడు రవీంద‌ర్‌రెడ్డి, మండ‌ల పార్టీ అధ్యక్షుడు మ‌ల్లేష్, ప‌ట్టణ అధ్యక్షుడు అంజిగౌడ్‌లు కోరారు.

బుధ‌వారం న‌ర్సాపూర్ ప‌ట్టణంలో స్థానిక విలేక‌రుల‌తో వారు మాట్లాడుతూ.. స‌భ‌కు న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌జ్వేల్‌కు పెద్ద ఎత్తున జ‌నాన్ని త‌ర‌లిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం అవ‌లంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల‌ను గ‌జ్వేల్ స‌భ నుంచే తిప్పికొడ‌తామని తెలిపారు. ఈ స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు,కార్యక‌ర్తలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed