- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాయంపేటలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
దిశ, శాయంపేట: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 37వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని, బ్యాంకులను జాతీయం చేసి పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆశయాలను కొనసాగించి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, చింతల భాస్కర్, మారేపల్లి బుజ్జన్న, చిందం రవి, రఫీ, దుబాసి కృష్ణమూర్తి, మార్కండేయ, నిమ్మల రమేష్, రాజ్ కుమార్, పత్తి శీను,మస్కికుమార్ రాజు, రవి పాల్, రఘు తదితరులు పాల్గొన్నారు.