- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్టీ కోసం పని చేస్తే.. మాకిచ్చే గౌరవం ఇదా ?
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు, రాహుల్ గాంధీ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు సమాచారం. సోనియా గాంధీ అనారోగ్యంగా ఉన్న సమయంలో లేఖ రాయడంపై రాహల్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మొత్తం 23 మంది సీనియర్ నేతలపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. లేఖ రాయడం వెనుక ఆంతర్యమేంటని వారిని ప్రశ్నించినట్లు తెలిసింది.
దీంతో రాహుల్ వ్యాఖ్యలపై ఆజాద్, సిబల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీతో సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆజాద్ రాహుల్ తో స్పష్టమం చేసినట్లుగా తెలిసింది. ఇటు మరో నేత కపిల్ కూడా రాహుల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీతో లింకులు ఉన్నాయని ఎలా అంటారని రాహుల్ పై ఆయన తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. 30 ఏళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తే మాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన రాహుల్ ను ప్రశ్నించినట్లు సమాచారం.