కరోనాపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన

by Shyam |   ( Updated:2020-03-28 05:29:33.0  )
కరోనాపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన
X

దిశ, మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కరోనా నియంత్రణలో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, మిడ్జిల్ ఎంపీటీసీ సభ్యుడు ఎండీ.గౌస్లు వివిధ గ్రామాలలో తిరుగుతూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రతలను వివరించారు. రానున్న20 రోజుల పాటు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు ఉస్మాన్, పర్వతాలు, రాముగౌడ్, ఎదుల శివ, పసుల శివ, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags: congress leader, carona, ts news

Advertisement

Next Story

Most Viewed