- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేయి తాకితే కూలి పోతున్న గోడలు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కె కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నాణ్యత లోపించిందని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని చెరువులో ముంపునకు గురైన వారికి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డబుల్ ఇండ్ల గోడలు చేతులు తాకితే పడిపోతున్నాయన్నారు. ప్రభుత్వ అధికారుల అండదండలతో పనుల్లో జాప్యం చేస్తూ, పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిర్మాణానికి వాడే ఇసుక, ఇటుక, సిమెంట్ రాడ్‌లు నాసిరకమైనవని ఆరోపించారు. ఈ ఇండ్లలో ప్రజలు నివసిస్తే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకోసం విడుదల చేసిన నిధులకంటే అదనంగా, మరిన్ని నిధులు విడుదల చేయాలని కోరారు. ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన వస్తువులు నాణ్యమైనవి వాడాలని కోరారు.