‘హస్తం’ నేతలకు కొవిడ్ రూల్స్ వర్తించవా..?

by Ramesh Goud |
‘హస్తం’ నేతలకు కొవిడ్ రూల్స్ వర్తించవా..?
X

దిశ, హుజూర్‌నగర్ : ప్రస్తుతం కొవిడ్ కేసులు విజృంభిస్తున్న వేళ దాని నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో కొవిడ్ పేషెంట్లకు ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు. హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరాలతో పాటు కొవిడ్ నిర్దారణ టెస్టులు చేసే కిట్లు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు శనివారం ఉదయం ఆస్పత్రికి వెళ్లి పరిశీలించడమే కాకుండా హాస్పిటల్ సూపరిండెంట్ కిరణ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఆయన హాస్పిటల్ ముందు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా సమయంలో సామాజిక దూరం పాటించి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన నాయకులే ఇలా గుంపులు గుంపులుగా చేరి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed