ఎంఐఎంతో కలిసి సీఎం కేసీఆర్​ కుట్ర: విజయశాంతి

by Shyam |   ( Updated:2020-11-27 11:51:02.0  )
ఎంఐఎంతో కలిసి సీఎం కేసీఆర్​ కుట్ర: విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న సీఎం కేసీఆర్ ఎంఐఎం పార్టీతో కలిసి కుట్రలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. శుక్రవారం విజయశాంతి సోషల్​ మీడియా వేదికగా మాట్లాడుతూ గ్రేటర్​లో ఎంఐఎం నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే, వారి దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని మండిపడ్డారు.

Advertisement

Next Story