- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగ నాటకాలు ఆడుతోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
దిశ, ఉప్పల్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో జరుగుతోన్న వరి దీక్షకు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. తక్షణమే ప్రభుత్వాలు స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక, చేసినా వెంటనే కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం కళ్లాల్లోనే మొలకెత్తుతోందని అన్నారు. రైతులు ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.