- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రేవంత్ రెడ్డిని తలుచుకుంటే కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదు’
దిశ, వికారాబాద్: ఉప ఎన్నికలు వస్తేనే తెలంగాణలోని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని, రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మొదటి బహిరంగ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టక రేవంత్ రెడ్డిపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దళిత గిరిజన ఆత్మగౌరవ సభతో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వణుకు ప్రారంభమయ్యిందని విమర్శించారు. దాంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేయాలనే లక్ష్యంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సీ సబ్ ప్లాన్ పథకాన్ని ప్రవేశ పెట్టారని గుర్తుచేశారు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులను వారి ఎదుగుదలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. జనరల్ పథకాలే కాకుండా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ప్రత్యేక పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వివరించారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామాలు, హరీశ్ రావు, కేసీఆర్, కేటీఆర్ నియోజకవర్గాలకే రాష్ట్రంలో ప్రాధానత్య ఉందని అన్నారు. దళితుల్లో చైతన్యం తెచ్చే విధంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, అనంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, కౌన్సిలర్ మురళి, నర్సింలు, కమాల్ రెడ్డి, రెడ్యానాయక్, బాబాఖాన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.