- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈసీ అంటే ఎలక్షన్ కమీషన్: రాహుల్ గాంధీ
by Shamantha N |
X
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసోం మంత్రి హిమంత బిశ్వ శర్మపై ఆంక్షల సడలింపు, బీజేపీ ఎమ్మె్ల్యే కారులో ఈవీఎంలు లభించిన ఘటనపై తీసుకున్న చర్యలపై ఆయన అసహనాన్ని ట్విట్టర్‌లో వ్యక్తపరిచారు. ఎన్నికల కమిషన్‌ను ‘ఎన్నికల కమీషన్’గా పేర్కొన్నారు. ఈసీ నిష్పక్షపాతంపై ఇటీవలే కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తింది. ప్రతిపక్ష నేతను జైలుకు పంపిస్తానని బెదిరించిన హిమంత బిశ్వ శర్మ ప్రచారం చేయకుండా తొలుత 48 గంటలపాటు నిషేధం విధించిన ఈసీ అనంతరం దాన్ని సగానికి అంటే 24 గంటలకు కుదించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే వాహనంలో ఈవీఎంలు లభించిన ఘటనపై ఈసీ తీరును నిరసిస్తూ రాహుల్ గాంధీ ఈ నెల 2న విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం కారు ఖరాబ్, బీజేపీ నీతి ఖరాబ్, ప్రజాస్వామ్య పరిస్థితి ఖరాబ్ అంటూ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story