కాంగ్రెస్ నేత హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

by Shamantha N |   ( Updated:2021-07-22 06:57:25.0  )
Supreme Court Fires On AP
X

న్యూఢిల్లీ: ధనిక, పేదలు అనే తేడా లేకుండా సమన్యాయం అందాలని, అంతేకానీ, ఏకకాలంలో వేర్వేరు లీగల్ సిస్టమ్‌లకు వీలుకల్పించకూడదని దిగువ న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. రాజకీయ అధికారం, వనరులు కలిగి ఉండే ధనికులకు, న్యాయస్థానాలను ఆశ్రయించి జస్టిస్ పొందడానికి వనరులు తక్కువగా ఉండే పేదలకు సమరీతిలో న్యాయం అందాలని, ఈ వర్గాలను వేర్వేరుగా ట్రీట్ చేయవద్దని తెలిపింది. రెండు లీగల్ సిస్టమ్‌లు కలిగి ఉంటే అది చట్టాల్లోని న్యాయబద్ధతను క్రమేపీ పలుచన చేస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం పేర్కొంది.

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా స్వతంత్ర, పారదర్శక జ్యుడీషియరీ ప్రజాస్వామ్యానికి పునాది అని వివరించింది. న్యాయవ్యవస్థపై పౌరుల విశ్వాసాన్ని కాపాడుకోవడంలో జిల్లా స్థాయి న్యాయవ్యవస్థలు కీలకమని తెలిపింది. వలసవాద ఆలోచనా దృక్పథాన్ని జిల్లా స్థాయి న్యాయవ్యవస్థలపై రుద్దారని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత దేవేంద్ర చౌరాసియాను హత్య చేసిన రెండేళ్ల కేసులో బీఎస్పీ ఎమ్మెల్యే భర్తకు లభించిన బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed