- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్పందించిన మాణిక్కం ఠాగూర్.. మానవత్వం చాటిన ఎమ్యెల్యే
దిశ, భువనగిరి: కరోనాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఆక్సిజన్ వెంటిలేటర్ బెడ్‌ను సమకూర్చారు. వివరాళ్లోకి వెళితే.. భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన చైతన్య స్కూల్ కరెస్పాండెంట్ తాడూరి చంద్రయ్య అల్లుడు ఆనంద్ కుమార్ కోవిడ్ బారినపడి సీరియస్‌గా ఉన్నారు. దీంతో ఆయన పరిస్థితిని వివరిస్తూ బెడ్ ఇప్పించాలని ట్విట్టర్ వేదికగా పీసీసీ కార్యదర్శి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొత్నక్ ప్రమోద్ మాణిక్కం ఠాగూర్‌ను విజ్ఞప్తి చేశారు.
దీంతో స్పందించిన ఠాగూర్ పెరంబుదూర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా.. వెంటనే స్పందించిన ఆ ఎమ్మెల్యే స్వయంగా చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి ఐసీయూలో వెంటిలేషన్‌తో కూడిన బెడ్‌ను సమకూర్చి మానవత్వం చాటుకున్నారు. ఇందుకు సహకరించి ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందించిన మాణిక్కం ఠాగూర్, పెరంబుదూర్ ఎమ్మెల్యేలకు బాధిత కుటుంబసభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.