జంగా రాఘవరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలి

by Sridhar Babu |   ( Updated:2021-12-18 04:28:33.0  )
Janga1
X

దిశ, జనగామ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో ధరల నియంత్రణ లేక అటు దేశంలో ఇటు రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోని ప్రభుత్వాల మెడలు వంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు శనివారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ మీదుగా ఆర్అండ్ బి అతిథి గృహం వరకు వందలాది మంది కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ.. చేతగాని ప్రభుత్వాలు పాలన చేయడం చేతకాకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యా వసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. పెంచిన ధరల నియంత్రణ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలను మెడలు వంచి గద్దె దించే పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story