రాజయ్య రాజీనామా చేస్తే.. కాంగ్రెస్ పోటీ చెయ్యదు

by Shyam |   ( Updated:2021-08-31 08:22:58.0  )
Congress leader Janga Raghava Reddy
X

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య రాజీనామా చేస్తే.. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని దళితవాడలో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని విమర్శించారు. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి కొత్త పథకాల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ‘దళితబంధు’ కేవలం హుజరాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన స్టేషన్‌ఘన్‌పూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే స్థానిక ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా చేయాలన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిరా మాట్లాడుతూ.. రెండు వేల కోట్ల మేర సంపాదించుకున్న ఎమ్మెల్యే రాజయ్య, నియోజకవర్గ రుణం తీర్చుకునేందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, నాయకులు దొమ్మాటి సాంబయ్య, చిలువేరు కృష్ణమూర్తి, జగదీష్, చంద్రారెడ్డి, మంచాల ఎల్లయ్య, చేపూరి వినోద్ కుమార్, చింత ఎల్లయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హుజురాబాద్‌లో అప్పర్ హ్యాండ్‌లో ఈటల.. ఫుల్ టెన్షన్‌లో మంత్రి హరీష్

Advertisement

Next Story

Most Viewed