- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ తీరుతో భవిష్యత్తులో చీకటి తెలంగాణ: మాజీ మంత్రి చిన్నారెడ్డి
దిశ, వనపర్తి: బంగారు తెలంగాణ కాదు అంధకార తెలంగాణగా మారే ప్రమాదం ఉందని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. కృష్ణా, గోదావరి జలాలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెజిట్ పత్రాలను దహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రెండు కోతుల మధ్య కొట్లాట పిల్లికి లాభం అయిన చందంగా.. ఆంధ్రా-తెలంగాణ మధ్య జలాల వాటా గొడవలో కేంద్రం లాభం పొందుతుందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తాం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. భవిష్యత్తు రోజుల్లో బంగారు తెలంగాణ మాట అటుంచితే చీకటి తెలంగాణగా మారే ప్రమాదం ఉందని చిన్నారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, కిరణ్ కుమార్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, మైనారిటీ నాయకులు బాబా, తెలుగు మీడియా సమన్వయ కర్త వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.