డ్రగ్స్ కేసులో కేటీఆర్‌కు లింకు.. సినీ తారలతో సంబంధాలు.. ఈడీకి కంప్లైంట్‌

by  |   ( Updated:2021-09-17 04:38:03.0  )
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డ్రగ్స్ కేసులో మంత్రి కేటీఆర్‌కు ప్రమేయం ఉన్నదని, అందువల్లనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దర్యాప్తు జరగకుండా ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌పోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్‌కు శుక్రవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో వెలుగులోకి వచ్చిన మాదక ద్రవ్యాలేవీ రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ తయారవుతున్నవి కావని, ఇతర దేశాల నుంచి సమకూర్చుకుంటున్నవేనని, సినీ తారలకు అవి అందుతున్నాయని, వారితో కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయని ఆ ఫిర్యాదులో బక్క జడ్సన్ ఆరోపించారు. ఈ ఫిర్యాదును ఈడీ స్వీకరించింది.

రాష్ట్రంలో నాలుగేళ్ళ క్రితం డ్రగ్స్ వ్యవహారం చోటుచేసుకున్నదని, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందని, 12 మందిని నిందితులుగా పేర్కొని 11 మందిపై ఛార్జిషీట్లను దాఖలు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నత్తనడకన దర్యాప్తు చేయించడంపై అనుమానాలు ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ తారలతో కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయని, మనీ లాండరింగ్ వ్యవహారాల్లోనూ ఆయన ప్రమేయం ఉన్నదని ఆరోపిస్తూ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన కొన్ని వీడియోల వివరాలను ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు సమర్పించారు. మంత్రి హోదాలో కేటీఆర్ అధికారికంగా చేసిన ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల పర్యటనలతో పాటు వ్యక్తిగతంగా చేసిన టూర్ల వివరాలను కూడా పరిశీలించాలని ఈడీకి ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed