- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్తూర్ మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన కాంగ్రెస్
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని కొత్తూర్ మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ విజయం వైపు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన నాలుగు వార్డుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు చొప్పున విజయం సాధించాయి. 1వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్ధి 183 ఓట్ల మెజార్టీతో, 4వ వార్డుల్లో 56 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందింది. ఇక టీఆర్ఎస్ 7వ వార్డుల్లో 26 ఓట్లతో, 10వ వార్డుల్లో 216 ఓట్లతో విజయం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ హావా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తూర్ మున్సిపాలిటీలో విచిత్రమైన ఫలితాలు వెల్లడవుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.
మొదటి రౌండ్ ఫలితాలతో టీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులుండగా ఇప్పటికే 4 వార్డుల ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతం అయినప్పటికీ అధికార పార్టీ ప్రలోభాలకు పార్టీలు మారారు. కానీ ఫలితాలు చివరి వరకు ఏవిదంగా వస్తాయో వేచిచూడాల్సిందే. ఏదిఏమైనా మొత్తం మీద కాంగ్రెస్ తమ బలాబలాన్ని చూపిస్తోంది. ఇప్పటికైతే అధికార పార్టీతో గట్టిగానే తలపడుతుంది. గెలిచిన వార్డుల్లో కాంగ్రెస్ ఓటింగ్ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓటమి చెందిన వార్డుల్లో కూడా పెద్దగా తేడా లేకపోవడం గమనార్హం.