టీఎన్జీవో నూతన కార్యవర్గానికి అభినందనల వెల్లువ..!

by Shyam |
టీఎన్జీవో నూతన కార్యవర్గానికి అభినందనల వెల్లువ..!
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్:

టీఎన్జీవో నూతన కార్యవర్గానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పదవీ విరమణ చేసిన మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డితో పాటు సంఘం నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎన్జీవో నేతలను పలువురు జిల్లాలకు చెందిన యూనియన్ ప్రతినిధులు, నగర నాయకులు సన్మానించారు.

ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. టీఎన్జీవో అధ్యక్షుడుగా కొనసాగిన కారం రవీందర్ రెడ్డి.. ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలను పరిష్కరించారని కొనియాడారు. నూతన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‎ల నేతృత్వంలో ఇప్పుడు మరింత వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed