- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మావోయిస్టుల్లో అభిప్రాయ విభేదాలు..!

X
దిశ, భద్రాచలం: మావోయిస్టుల మధ్య అభిప్రాయ భేదాలతో గత కొన్నిరోజులుగా పరస్పర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ప్రకటించారు.
ఇటీల జరిగిన ఈటోవర్ అడవుల్లో గంగలూరు ఏరియా కమిటీ కమాండ్ మొడియం దినేష్‌తో జరిగిన ఘర్షణలో వెస్ట్ బస్తర్ డీవీసీ మెంబర్ మొడియం విజ్జా మరణించినట్లు సమాచారం. విజ్జా కాకుండా జన మిలీషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్ సందీప్ @బుధారాం, జనతన సర్కార్ ఇన్‌చార్జి లఖు హేమ్లా, డీఏసీఎంఎస్ రేంజ్ కమిటీ అధ్యక్షుడు సంతోష్, జనతన సర్కార్ అధ్యక్షుడు దస్రు మండవి, మిలీషియా ప్లాటూన్ కమాండర్ పూనెం కమ్లు అనే మావోలు పరస్పర దాడుల్లో మృతి చెందినట్లు ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. కాగా, ఈ విషయమై మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
Next Story