- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన..
దిశ ఖమ్మం టౌన్: ఖమ్మం స్థానిక ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద కొద్ది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు తో కలసి కొంతమంది కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. అధికార పార్టీకి సంబంధించిన జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్ధి రాయల ఆరోపించారు. పోలింగ్ కేంద్రం వద్దకు ఎన్నిక నియమావళి ప్రకారం కేవలం ఓటు హక్కు కలిగి ఉన్నవారు మాత్రమే రావాలన్నారు.
అలాగే ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఓటరు గానీ అభ్యర్ధి గానీ రావాలని, కార్యకర్తలు రావడం ఏంటని పోలీసులు వారించారు. అక్కడితో ఆగకుండా కొంతమంది పోలీసులు అతి ఉత్సహంతో పార్టీ కార్యాలయంలో ఉన్న వారిని సైతం వదలకుండా అరెస్టులు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
సుమారు గంటపాటు హైడ్రామా నడిచింది. అడిషనల్ సీపీ బోస్ నేతృత్వంలో ఏసీపీ ఆంజనేయులు, సీఐ శ్రీధర్ గౌడ్ ఇతర పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో ఎవరు ఉండొద్దని ఆంక్షలు విధించడంతో ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల జోక్యం చేసుకుని పోలీస్ లతో వారించారు.