- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాఫిక్ చలాన్లపై మెగా లోక్ అదాలత్ నిర్వహించండి..
దిశ, డైనమిక్ బ్యూరో : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లక్షల కొద్ది పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేసేందుకు మెగా లోక్ అదాలత్ నిర్వహించాలని సామాజిక కార్యకర్త మహమద్ షాబుద్దిన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంపై కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు సూచనలు ఇవ్వాలని కోరుతూ ఈ మెయిల్ ద్వారా లేఖ పంపించారు. ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలోని సామాన్య ప్రజలు చలాన్లు చెల్లించలేని స్థితిలో ఉన్నారని, కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని తెలిపారు.
అందువల్ల ట్రాఫిక్ మెగా లోక్ అదాలత్ ఏర్పాటు చేసి 50 శాతం డిస్కౌంట్ ఇస్తే చలాన్లు చెల్లిస్తామని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 2017లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ లోక్ అదాలత్ గురించి గుర్తు చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్పందించి పోలీస్ కమిషనర్‌కు ఫార్వార్డ్ చేసినట్లు తెలిపారు. పోలీసు అధికారుల నుంచి స్పందన వస్తుందని, ట్రాఫిక్ మెగా లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నట్లు షాబుద్దిన్ తెలిపారు.