- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ లో హైరానా… ఎందుకంటే?
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిలాకు చెందిన కొంతమంది ఆందోళన చెందుతున్నారు. విషయం ఏంటో తెల్వడంతో అక్కడికి పరుగులు పెడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు ఇబ్బందులు పడకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయంతో పాటు రేషన్ బియ్యాన్ని అందజేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలో కొంతమందికి ఆ సాయం అందలేదు. దీంతో వారు పరుగులు పెడుతున్నారు.
ఆగమాగమవుతున్న నిరుపేదలు..
కరోనా సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కుటుంబానికి రూ. 1500 తో పాటు ఒక్కొక్కరికి 12 కిలోల రేషన్ బియ్యాన్ని అందజేసింది. అయితే నిజామాబాద్ జిల్లాలో 37 వేల మంది నిరుపేదలకు కరోనా సాయం అందలేదు. జిల్లాలో మొత్తం 3,90,801 రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ఈ పాస్ యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని, కుబేర్ యాప్ ద్వారా వివరాలు నమోదైన వారి ప్రకారం రేషన్ కార్డులు కలిగిన వారికి నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. కానీ, ఈ పాస్ యంత్రాల వాడకం వలన కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉండటంతో రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యం పంపిణీ చేశారు. అయితే, జిల్లాలో 18 వేల మంది గత మూడు నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని వారికి కరోనా సాయాన్ని అందజేయలేదు. 17 వేల మందికి రేషన్ అందించారు. కానీ, డబ్బులు మాత్రం అకౌంట్లలో జమ చేయలేదు. వారు రేషన్ దుకాణాలలో ఇచ్చిన బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేకపోవడం అందుకు కారణమైంది. దీంతో వారు ఇప్పుడు ఆన్ లైన్ గానీ, ఆఫ్ లైన్ లో గానీ తమకు ప్రభుత్వ సాయం అందలేదని గగ్గోలు పెడుతూ రేషన్ దుకాణాల నిర్వాహకుల ద్వారా రెవెన్యూ అధికారుల వద్దకు పరుగులు తీశారు. అక్కడ ఆ అధికారులు చెప్పిన విధంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేసి జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
అందజేసేందుకు భారమైంది..
ఈ నేపథ్యంలో ఆధార్ నెంబర్ అనుసంధానం లేని బాధితులు హైరానా పడుతూ మీ సేవా కేంద్రాలలో ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. ఏప్రిల్ నెలకు ముందు రేషన్ సరుకులను 3 నెలలు తీసుకోకుండా ఉన్న 18 వేల మందికి రూ.1500 చొప్పున కరోనా సాయం నిలిపి వేయడం ద్వారా రూ. 2.7 కోట్లు మిగిలిపోయాయి. వారికి కేటాయించిన బియ్యం కుడా పంపిణీ నిలుపుదల కూడా ప్రభుత్వానికి మిగులే. ఆధార్ అనుసంధానం లేకుండా రేషన్ తీసుకున్న 17 వేల మంది పేదల బ్యాంక్ ఖాతాలలో ఆర్ధిక సాయం జమకాకపోవడం వలన రూ.2.5 కోట్లు ప్రభుత్వానికి మిగిలాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం వలస కూలీలకు, రేషన్ కార్డులు లేని వారికి ఒక్కొక్కరికి రూ.500 లతో పాటు 12 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డులు లేకుండా దరఖాస్తు చేసుకున్న వారికి కరోనా సాయం కింద రూ.1200 లతో పాటు 12 కిలోల చొప్పున బియ్యం అందజేసేందుకు ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైంది.
Tags: ration, poor people, Nizamabad, bank account, no Money