ఆ ఆపిల్ చార్జర్ సరిగా పనిచేస్తలేదట..

by Anukaran |   ( Updated:2020-12-11 08:27:47.0  )
ఆ ఆపిల్ చార్జర్ సరిగా పనిచేస్తలేదట..
X

వెబ్​డెస్క్​: ఆపిల్​ ఫోన్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతకాదు. చాలా మంది ఈ ఫోన్​ కొనడానికి ఇంట్రస్ట్​ చూపుతారు. చేతిలో ఆఫోన్​ ఉంటే గ్రేట్​గా ఫీల్​ అవుతారు. స్టన్నింగ్​ లుక్​తోపాటు ఇతర స్మార్ట్​ఫోన్​ల కంటే ఎంతో మెరుగైన పనితీరు కనబరుస్తుంది. సెక్యూర్​గా ఉండడం కూడా ఒక కారణం​గా చెప్పుకోవచ్చు.

అయితే ఈ మధ్య ఆపిల్​ సంస్థ ఐఫోన్​ 12 మోడల్స్​ కోసం రిలీజ్​ చేసిన మాగ్​సేఫ్​ డ్యుయో వైర్​లెస్​ చార్జర్​ అంత మెరుగైన పనితీరు కనబర్చడం లేదన్న కామెంట్స్​ వస్తున్నాయి. మాగ్​సేఫ్​ వైర్​లెస్​ చార్జర్ అంత పర్​ఫెక్ట్​గా లేదంటున్నారు వినియోగదారులు. ఎందుకంటే ఇది 29w పవర్​ అడాప్టర్​ అయినప్పటికీ ఫోన్​తోపాటు యాపిల్​ వాచ్​ చార్జింగ్​కి సపోర్ట్​ చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఆపిల్​ తన సపోర్ట్​ డాక్యుమెంట్​లో తెలిపినట్టు 29w​ యుఎస్​బీ టైప్​ సీ అడాప్టర్​ మాగ్​సేఫ్​ డ్యుయోతో కనెక్ట్​ కావడం లేదు. ఆ అడాప్టర్​కు అవసరమైన 5V / 3A లేదా 9V / 1.6A పవర్​ రేటింగ్​కు సపోర్ట్​ కాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

మాగ్​సేఫ్​ డ్యూయో 29W అడాప్టర్​కు కనెక్ట్​ అయినప్పుడు ఇది ఒకేసారి ఐ ఫోన్​ లేదా ఆపిల్​ వాచ్​లలో ఏదో ఒకదాన్ని మాత్రమే చార్జ్​ చేస్తోందంటున్నారు వినియోగదారులు. ఇంతకుముందు ఐ ఫోన్​ 12 మినీ పవర్​ చార్జింగ్​లో పీక్​ పవర్​ డెలివరీలో భాగంగా 12w అడాప్టర్​ మాత్రమే పనిచేస్తుందని ఆపిల్​ ఇండికేట్ చేసింది. కానీ, లైటినింగ్​ ఇయర్​పాడ్స్​ వంటి యాక్ససరీస్​ కనెక్ట్​లో ఉన్నప్పుడు మాగ్​సేఫ్​ చార్జర్​ నియంత్రణ ప్రమాణాలకు తగ్గట్టు 7.5w చార్జింగ్​కు మాత్రమే పరిమితం అవుతోంది. ఫాస్ట్​ చార్జింగ్​ కాకపోవడం ఇక్కడ లోపంగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed