భారత్, అమెరికా మధ్య కీలక ఒప్పందం

by Shamantha N |
భారత్, అమెరికా మధ్య కీలక ఒప్పందం
X

దిశ, వెబ్‌డెస్క్: సమాచార మార్పిడి, సహకార ఒప్పందం (బెకా)పై భారత్, అమెరికా మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో ఇరుదేశాల నేతలు సంతకాలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌ హౌస్‌లో 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్, విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పాల్గొన్నారు. ఈ ఒప్పందంతో అమెరికా సైనిక శాటిలైట్స్ ద్వారా కీలక సమాచారం, ఇమేజ్‌లను భారత్ పొందే సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ ఒప్పందంపై ప్రాధాన్యత సంతరించుకోగా… అమెరికాతో బెకా ఒప్పందం జరగడం చారిత్రక మైలురాయిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పేర్కొన్నారు. రెండు దశాబ్ధాలుగా భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యాయని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ అన్నారు. భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తుందని, కరోనా వైరస్‌, భద్రతా సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ భద్రత, సుస్థిరత కోసం భారత్‌-అమెరికా భాగస్వామ్యం కీలకమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed