- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలిక మృతిపై విచారణ కమిటీ
దిశ, న్యూస్ బ్యూరో :
అనాథాశ్రమంలో ఉంటూ అత్యాచారానికి గురై నీలోఫర్ ఆస్పత్రిలో మృతి చెందిన మైనర్ వ్యవహారంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ స్పందించింది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా నలుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు అపర్ణా గిరిధర్‌తో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెందిన అన్నపూర్ణాదేవి, మహిళా సేఫ్టీ విభాగానికి చెందిన డి.ప్రతాప్, రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి జీకే సునంద ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని మారుతో హోమ్‌లో ఉంటున్న 14 ఏళ్ళ మైనర్ బాలిక అత్యాచారానికి గురై తీవ్ర అనారోగ్యంతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై లోతుగా అధ్యయనం చేసి సిఫారసులతో కూడిన నివేదిక సమర్పించాలని కోరింది. అంతేకాకుండా, బాలిక మృతికి గల కారణాలను కూడా వెల్లడించాలని, మృతురాలి బంధువులను సంప్రదించి వివరాలను రికార్డు చేయాలని ఆ కమిటీకి మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య సూచించారు.