వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

by Shyam |
వర్షాలతో అప్రమత్తంగా ఉండండి
X

దిశ, మెదక్:
రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నందున ఎలాంటి విపత్కర పరిస్థితులు సంభవించినా వాటిని అధిగమించేందుకు జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. మెదక్ జిల్లాలో ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి సమాచారాన్ని ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా వరదల కారణంగా రోడ్లు తెగిపోయినా, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించినా అలాంటి ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని కోరారు. ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఇతర ప్రజా ప్రతినిధులతో పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకొని ప్రమాద నివారణ చర్యలను చేపట్టడానికి సిద్ధంగా వుండాలని సూచించారు. పట్టణాల్లో, గ్రామాల్లో మట్టితో కట్టిన పురాతన ఇండ్ల గురించి సమాచారం తెలుసుకోవాలన్నారు. ఇండ్లు కూలే అవకాశం ఉంటే సంబంధిత అధికారుల సహకారంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed