- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ అవకాశాన్ని కల్పించాం.. ఆనందంగా జీవించండి
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: గతంలో అనేక తప్పులు చేసి, దీర్ఘ కాలంగా ఎలాంటి నేరాలు చేయకుండా బుద్ధిగా మెలిగిన 31 మంది రౌడీషీటర్ల రౌడీషీట్లను క్లోజ్ చేసినట్టు హైదరాబాద్ నగర కమిషనర్ సోమవారం అంజనీ కుమార్ తెలిపారు. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల మేళాను సాలార్ జుంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ల పేర్లను పోలీస్ రికార్డుల్లో నుంచి తొలగించామని స్పష్టం చేశారు. వీరంతా కొత్త జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఓ అవకాశం కలిపించామని అన్నారు. సమాజంలో మంచిగా మెలగాలని, బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈ 31 మంది మళ్లీ ఎలాంటి నేరాలు చేసినా, తిరిగి మళ్లీ జైలుకు వెళతారని సీపీ హెచ్చరించారు.
Advertisement
Next Story