- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాణిజ్య వాహన విక్రయాలు క్షీణించొచ్చు : ఇక్రా
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా దేశీయ వాణిజ్య వాహనాల విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 25-28 శాతం తగ్గిపోవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. అదేవిధంగా నిరంతర సవాళ్ల నేపథ్యంలో ఈ రంగంపై ఉన్న దృక్పథాన్ని ప్రతికూలంగా ఉంచుతున్నట్టు ఇక్రా తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆల్‌టైమ్ గరిష్ఠంగా 10,07,311 యూనిట్లతో పోలిస్తే, గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల విక్రయాలు 7,17,688 యూనిట్లుగా నమోదయ్యాయని ఇక్రా పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది మరింత తగ్గే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. అధిక సామర్థ్యంతో పాటు సరుకు రవాణా, ఫైనాన్స్ అడ్డంకుల వల్ల వాణిజ్య వాహనాల పరిశ్రమకు సంబంధించి ప్రతికూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు ఇక్రా వివరించింది. ఈ ఏడాది 25-28 శాతం విక్రయాలు క్షీణిస్తే పరిశ్రమ దశాబ్ద కనిష్టానికి నమోదు చేస్తుందని ఇక్రా నివేదికలో వెల్లడించింది. క్షేత్ర స్థాయిలో వాణిజ్య వాహనాల విక్రయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో 11 రాష్ట్రాల నుంచి 26 వాణిజ్య వాహనాల డీలర్ల నుంచి వివరాలను సేకరించినట్టు ఇక్రా తెలిపింది.
‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకు అమ్మకాల క్షీణత విస్తరిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెరిగిన ధరలు కొత్త ఉద్గార నిబంధనలతో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఉన్న కొవిడ్-19 సవాళ్లకు ఇది మరింత తోడ్పడిందని’ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ షమ్షార్ దేవాన్ చెప్పారు.