'మా గంగానది'తో అలీ తనయ టాలీవుడ్ ఎంట్రీ

by Shyam |
మా గంగానదితో అలీ తనయ టాలీవుడ్ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్ : కమెడియన్ అలీ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఖరారైపోయింది. అలీ నటిస్తున్న ‘మా గంగానది’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది అలీ తనయ జువేరియా. ఈ సినిమాలో జువేరియా కీలక పాత్ర పోషిస్తుండగా… మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. నియా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బాల నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. మూగాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం అలీకి 1109వ చిత్రం. కాగా మహిళ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా కథ ఉండగా… లాయర్‌గా కనిపించనున్నారు అలీ. వి. నాగేశ్వర రావు, సూర్య వంతరం, ఎంఎన్‌యు సుధాకర్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న సినిమాకు .. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

Tags: Ali, Baby Zuveria, Tollywood, Niya, Maa Ganganadi

Advertisement

Next Story