KTR కీలక వ్యాఖ్యలు.. రాజకీయాల్లోకి అందుకే వచ్చా

by Anukaran |   ( Updated:2021-09-22 06:53:33.0  )
minister ktr
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలపై తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో విదేశాల్లో ఉద్యోగం వదిలేసి వచ్చేసినట్లు చెప్పుకొచ్చారు. కిస్మత్‌పురలోని ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ఐ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ సెంటర్‌ను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు.

తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దేశం ఇప్పుడున్నట్లు లేదని, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా దేశంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అతిపెద్ద వైద్య పరికరాల పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లజోళ్లు, మరికొందరికి చికిత్స అందించామని వెల్లడించారు.

Advertisement

Next Story