- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళిత బంధు ఆపేశాం.. ఈసీకి కలెక్టర్లు రాసిన లేఖలో నో క్లారిటీ..!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలనుకున్న దళిత బంధు స్కీం ఆగిపోయింది. హుజూరాబాద్‌లోని లబ్ధిదారులకు డైరెక్ట్ బెన్ఫిట్ట్రాన్స్ఫర్(డీబీటీ) కింద డబ్బుల జమను ఆపేసినట్లు కరీంనగర్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్‌కు మంగళవారం లెటర్‌రాశారు. హుజూరాబాద్‌లోని దళిత బంధు పథకం అమలు తాజా పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని ఈసీ రిపోర్ట్ కోరగా, లబ్ధిదారుల అకౌంట్లలో పైసలు వేయడం లేదని కలెక్టర్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే జమ చేసిన డబ్బులతో యూనిట్లు గ్రౌండింగ్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాదాపు 17 వేల కుటుంబాలకు రూ. 10 లక్షల రూపాయల చొప్పున రూ.1700 కోట్లు అకౌంట్లలో జమ చేశారు. కొందరికి యూనిట్లు మంజూరు చేశారు. మరికొందరికి గ్రౌండింగ్దశలో ఉంది. దీంతో అకౌంట్లలో జమ చేసిన వారికి యూనిట్లు ఇచ్చేది.. ఇవ్వని దానిపై మాత్రం కలెక్టర్లు ఆ లేఖలో క్లారిటీ ఇవ్వలేదు.
మీరే ఆపేశారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు..
ఎన్నికలయ్యే వరకు హుజూరాబాద్‌లో దళితబంధు స్కీం అమలు నిలిపివేయాలనే ఫిర్యాదుఎవరి నుంచి వెళ్లిందనే దానిపై గందరగోళం నెలకొంది. ఏదైనా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సాధారణంగానే ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై ఈసీకి కంప్లయింట్స్వెళ్తుంటాయి. ఒకవేళ అవి ఓటర్లను ప్రభావితం చేసేవి అయితే ఎన్నికలయ్యే వరకు వాటిని ఆపేయాలని ఈసీ ఆదేశిస్తుంది. ఎప్పుడైనా ఎవరి నుంచి వచ్చిన కంప్లయింట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారో ఈసీ వెల్లడిస్తుంది. అయితే సీఈఓ నుంచి వెళ్లిన లెటర్ఆధారంగా ఈ స్కీం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్నదని, ఎలక్షన్పూర్తయ్యే వరకు హుజూరాబాద్‌లో దళిత బంధు ఆపేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఇదే అదునుగా భావించిన అధికార టీఆర్ఎస్పార్టీ బీజేపీనే కంప్లయింట్ చేసి ఆపేసిందనే ప్రచారం చేస్తోంది. బీజేపీ ఫిర్యాదు చేసినట్లు నిరూపించగలరా అని ఆ పార్టీ తరుఫున ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
సీఈఓ ఏం రాశారు..
ఈ నెల 8వ తేదీన రాష్ట్ర సీఈఓ శశాంక్ గోయల్రాసిన లెటర్ ఆధారంగా దళిత బంధు ఆపేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. అయితే ఈసీకి సీఈఓ ఏమని రాశారనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఎవరి నుంచి కంప్లయింట్వచ్చిందనే దానిపై వివరాలు వెల్లడించడం లేదు. వాస్తవానికి ఆగస్టులోనే ఫోరమ్ఫర్ గుడ్ గవర్నెన్స్, గోనె ప్రకాశ్ దళితబంధు స్కీంను హుజూరాబాద్ బై ఎలక్షన్అయిపోయే వరకు అమలు కాకుండా చూడాలని ఈసీకి కంప్లయింట్ చేశారు. అప్పుడు ఈ పథకం పాతదని, వాసాలమర్రిలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి తెలిపింది. ఇప్పుడు అదే కంప్లయింట్‌పై మళ్లీ సీఈఓ లెటర్ రాశారా ? లేక వేరే ఎవరైనా ఫిర్యాదు చేశారా అనేది మాత్రం బయటకు రానివ్వడం లేదు.