- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నమెంట్ హాస్పిటల్‌లో కలెక్టర్ భార్య ప్రసవం.. మంత్రుల ప్రశంసలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. భద్రాద్రి కలెక్టర్, సివిల్స్ ఆలిండియా టాపర్ అనుదీప్ కుమార్ భార్యకు భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవాన్ని చేయించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన భార్య మాధవి మగ శిశువుకు జన్మనిచ్చారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకాన్ని కల్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, దీనిపై మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కలెక్టర్ దంపతులకు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పడ్డాయని, తద్వారా ప్రజలు మొగ్గుచూపుతున్నారని వెల్లడించారు. ఇది ప్రత్యక్షంగా చూడటం మాకెంతో గర్వకారణంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ విషయం తెలుసుకున్న మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్‌లు సైతం కలెక్టర్ దంపతులను అభినందించారు. సీఎం కేసీఆర్ కార్పొరేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దారంటూ హర్షం వ్యక్తం చేశారు.
#BhadradriKothagudem జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ సేవలు పొంది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన @Collector_BDD @anudeepd7, మాధవి గార్ల దంపతులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. కొర్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దిన @TelanganaCMO కేసీఆర్ గారు.@MinisterKTR @KTRTRS pic.twitter.com/rIfsNqbWgl
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) November 10, 2021