- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టర్ సంతకం ఫోర్జరీ… కటకటాలపాలు..
దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కలెక్టర్, మైనింగ్ ఎడి సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 1.97 కోట్లు స్వాహా చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసీపీ అఖిల్ మహాజన్ పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితులు కలెక్టర్, మైనింగ్ ఎడి సంతకాలతో కూడిన దొంగిలించిన ఐసిఐసిఐ బ్యాంకుకు సంబంధించిన చెక్కు ద్వారా ఆక్సిస్ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు కుట్ర పన్నారు.
దీనిపై ఆక్సిస్ బ్యాంకు మేనేజర్ ఐసిఐసిఐ బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే మైనింగ్ ఎడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో నిందితుల గుట్టు రట్టయింది. మైనింగ్ ఎడితో జరిగిన గోడవను దృష్టిలో పెట్టుకొని ఈ మోసానికి పాల్పడిన రాజు, శ్రీనివాస్, జీవన్ లను అరెస్ట్ చేసినట్లు ఎసీపీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ ఎంఎల్ ముత్తి లింగయ్య పాల్గొన్నారు.