- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేడ్చల్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం…
దిశ ప్రతినిధి, మేడ్చల్:
ఎల్ఆర్ఎస్ జీవో రద్దు ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలన్న డిమాండ్‌తో బీజేపీ తలపెట్టిన మేడ్చల్ కలెక్టరేట్ ముట్టడి బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో కలెక్టరేట్ లోకి చొచ్చుకు పోయేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే కార్యాలయం ముందు పార్క్ చేసిన కలెక్టర్ వాహనాన్ని బీజేపీ నాయకులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఆరెస్ట్ చేసి కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కలెక్టర్ వాహనం ధ్వంసంపై కేసు నమోదు- ఏసీపీ మేడ్చల్ కలెక్టర్ వాహనంపై దాడి చేసిన ఘటనలో బీజేపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ తెలిపారు. దాడికి యత్నించిన కార్యకర్తలు,నాయకులతోపాటు కార్యక్రమానికి పిలుపునిచ్చిన నాయకులపై కేసు నమోదు చేస్తున్నట్టు ఆయన తెలియజేశారు.