గ్రీన్ ఫీల్డ్ భవనంలోకి.. మున్సిపల్ కార్యాలయం

by Shyam |
గ్రీన్ ఫీల్డ్ భవనంలోకి.. మున్సిపల్ కార్యాలయం
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పట్టణంలో వృథాగా ఉన్న గ్రీన్ ఫీల్డ్ స్టేడియంను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలను వృథాగా ఉంచరాదన్నారు. ఎలాగో అందోల్ జోగిపేట మున్సిపాలిటీకి సొంత భవనం లేదు కాబట్టి దీన్ని శుభ్రం చేసుకొని మున్సిపల్ కార్యాలయాన్ని ఈ భవనంలోకి మార్చుకోవాలని.. చైర్మెన్ గూడెం మల్లయ్య, కమిషనర్ మిర్జా ఫసహత్ అలీ బేగ్‌లకు సూచించారు. అనంతరం క్రీడా మైదానంలో ఉన్న పెవిలియన్ భవనాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. షటిల్ ఇండోర్ స్టేడియాన్ని మరోసారి వచ్చినప్పుడు పరిశీలిస్తానని తెలిపారు.

Advertisement

Next Story