ఉన్నతమైన విద్యను అందించండి : కలెక్టర్

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం రుద్రారం పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్‌లను కలెక్టర్ హనుమంతరావు మంగళవారం పరిశీలించారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. సమయ పాలన పాటించాలని, లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేగాకుండా విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి మరీ కలెక్టర్, డిజిటల్ క్లాస్‌లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ… డిజిటల్ క్లాస్‌లపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు.

Advertisement