‘ప్రజా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించండి’

by Shyam |
‘ప్రజా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించండి’
X

దిశ, నల్లగొండ: వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్వయగా స్వీకరించి అట్టి దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించి, ప్రజా విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించేటట్టు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఆరో విడత హరితహారంలో జిల్లా అంతటా విరివిగా మొక్కలు నాటి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని, జిల్లాలో అటవీ శాతాన్ని పెంచాలని అన్నారు. వర్షాలు పడుచునందున గ్రామాల్లో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడూ చేపట్టాలని, అలాగే అంటు వ్యాధులు, జ్వరాలు రాకుండా ఆయా పరిధిలో వైద్యాధికారులు గ్రామాలను సందర్శించాలని అన్ని ప్రాథమిక కేంద్రాలలో మందులను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులు, గ్రామపంచాయతీ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story