హరితహారంలో నిర్లక్ష్యం.. అధికారులకు మెమోలు

by Shyam |   ( Updated:2020-08-13 03:11:00.0  )
హరితహారంలో నిర్లక్ష్యం.. అధికారులకు మెమోలు
X

దిశ, ఎల్లారెడ్డి :

హరితహారం కింద గ్రామప్రకృతి వనం పనుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామసర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని.. అలాగే వాటి పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్న ఎంపీడీవో, ఎపీఓలకు చార్జి మెమోలు జారీచేయాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ జిల్లా పంచాయతీ అధికారిని అదేశించారు. గురువారం ఉదయం సదాశివనగర్, గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. సదాశివనగర్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పద్మాజివాడిలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పద్మాజీవాడి గ్రామ అవెన్యూ ప్లాంటేషన్ పనుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. భూంపల్లి శివారులో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు ఎండిపోయినందుకు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు.

నాటిన మొక్కలను పర్యవేక్షించనందుకు దాశివనగర్ ఎంపీడీవో, ఎంపీవోలకు చార్జి మెమోలు జారీ చేయాలన్నారు. గుడిమెట్, పోతంగల్ గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచులు , అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోతంగల్‌లోని రైతు వేదిక భవన నిర్మాణం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నరేష్, ఏపీడీ సాయన్న, తహసీల్దార్ రవీందర్, సర్పంచులు సదాశివనగర్ శ్రీనివాస్ రెడ్డి, పద్మాజీవాడి కవిత, మోడెగాం తిరుమల, భూంపల్లి లలితా బాయ్, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed