- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి : కలెక్టర్
దిశ, అసిఫాబాద్: ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తోన్న రుణాలు పొంది మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లాలోని కాగజ్‌నగర్ మండలంలోని రాస్పల్లి, దహేగాం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మహిళా మహోత్సవ్’ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు, మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులు అందిస్తోన్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఆర్థికంగా ఎదగాలని, తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా మరింత రుణ సదుపాయం పొందవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి బీమా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని, జిల్లాలో 51 మహిళా సంఘాలకు రూ.3 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాస్పల్లి, దహెగాం, ఎలకపల్లి శాఖల మేనేజర్లు శంకర్, సంతోష్, రాజేశ్వరరావు, మహిళా సంఘాల సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.