రేపు అక్కడ… సంపూర్ణ లాక్‌డౌన్

by srinivas |
రేపు అక్కడ… సంపూర్ణ లాక్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకులం జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాచింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, విజృంభిస్తోంది. దీంతో కరోనా విస్తృత వ్యాప్తిని అరికట్టడానికి ఆదివారం శ్రీకాకులం జిల్లా కేంద్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. ఈ లాక్‌డౌన్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ అమలులో ఉంటుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.

అంతేగాకుండా జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్గాలు, కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వైద్య సేవలు మినహా, మరేఇతర షాపులు తెరవడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే, వారిపై క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ హెచ్చరించారు.

Advertisement

Next Story