‘ఆ విత్తనాలు అమ్మొద్దు.. రైతులు కొనొద్దు’

by Shyam |
‘ఆ విత్తనాలు అమ్మొద్దు.. రైతులు కొనొద్దు’
X

దిశ, మెదక్: వర్షాకాలంలో మొక్కజొన్న విత్తనాలు అమ్మరాదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. మంగళవారం జిల్లాలోని డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దార్లు తదితరులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వరి, మొక్కజొన్న విత్తనాలను డీలర్లు అమ్మకూడదని ఆదేశించారు. ఇతర పంటలకు సంబంధించిన వాటిని మాత్రం అమ్మకాలు చేయవచ్చన్నారు. అలాగే, ఎరువుల కొరత ఏర్పడకుండా చూడాలన్నారు. విత్తనాల అమ్మకాలపై వ్యవసాయ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు నష్టం జరగకుండా.. లాభం చేకూర్చే పంటలను మాత్రమే సాగు చేసేలా తగు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. అంతేకాకుండా, విత్తనాల పేరిట రైతులను మోసగిస్తే డీలర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed