ఆ వివరాలను ఆన్‌లైన్ చేసుకోవాలి

by Shyam |
ఆ వివరాలను ఆన్‌లైన్ చేసుకోవాలి
X

దిశ, పటాన్‌చెరు: నిర్మాణాల వివరాలను ఆన్ లైన్ చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారంలో ఇంటి నిర్మాణలను, వాటి వివరాలను పంచాయతీ సిబ్బంది నమోదు చేస్తున్న ప్రక్రియ తీరును సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ…. గ్రామ పరిధిలోని ప్రతీ నిర్మాణాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అన్నారు. యజమాని పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, నిర్మాణం స్వభావం, విస్తీర్ణం కొలతలు తీసుకోని నమోదు చేయాలన్నారు. అన్ని రకాల నిర్మాణాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైతే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులకు ఆయన సుచించారు.

Advertisement

Next Story