- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సరదాలకు ఇది సమయం కాదు
X
దిశ, కొత్తగూడెం: గతకొన్ని రోజులుగా వరద ఉధృతి ప్రవహిస్తున్నందున ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, సెల్ఫీలు దిగడం, చేపలు పట్టడం, సరదాలకు ఇది సమయం కాదని కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు. నీటితో నిండిన జలాశయాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నందున నిషేదం విధించినట్టు చెప్పారు. నిబంధనలు అతిక్రమించే వ్యక్తులకు జరిమానా లేదా పోలీస్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
జలాశయాలు నిండి అలుగులు పడుతున్నాయని ఈ సమయంలో ప్రజలు చేపలు పట్టడం, కుటుంబ సభ్యులతో సందర్శన చేయడం, ప్రవాహాన్ని దాటాలని సాహసాలు చేయడం వల్ల ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని సూచించారు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో ప్రజా సమాచారం నిమిత్తం తక్షణం హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
Advertisement
Next Story