- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వేచ్ఛాయుత వాతావరణంలో దుబ్బాక బై పోల్ : కలెక్టర్ భారతి
దిశ, సిద్ధిపేట : కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు దుబ్బాక ఉపఎన్నిక స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా జరగాలని కలెక్టర్ భారతి హోలికేరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సెక్టోరియల్ అధికారులు, నోడల్ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో ఆమె సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఉపఎన్నికలో 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల పరిధిలో 165 లొకేషన్లలో 315 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు . వీటి పర్యవేక్షణ బాధ్యతలను 32 సెక్టోరియల్ అధికారులకు అప్పగించామన్నారు .
ఒక్కో సెక్టోరియల్ అధికారికి 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాల బాధ్యతలను అప్పగించామన్నారు. అన్ని కేంద్రాల్లో భారత ఎన్నికల సంఘం హామీ ఇచ్చిన మేరకు కనీస మౌలిక వసతులు ఉండేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి శ్రీమతి భారతి హోలికేరి సూచించారు. పోలింగ్ నిర్వహించే భవనాల్లో చెక్ లిస్టు ప్రకారం విద్యుత్, టెంట్ , ర్యాంపు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం ఉండాలన్నారు.
PO, APO విధులపై సెక్టోరియల్ అధికారులు అవగాహనా ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి పోలింగ్ కేంద్రానికి కేటాయించిన బృందాలు ఎలా ఉన్నాయో టీం సభ్యులతో మాట్లాడి తెలుసుకోవాలన్నారు. వీక్ ఉన్న టీంలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్‌ను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ రోజు సెక్టోరియల్ అధికారులకు స్పెషల్ మేజిస్ట్రేట్ అధికారాలు ఇవ్వనున్నందున ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే సంబంధిత సెక్టోరియల్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు . సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ పద్మాకర్ , ముజమిల్ ఖాన్ , RDOలు జయచంద్రా రెడ్డి , అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.