- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేలపై కూర్చున్న మంచిర్యాల కలెక్టర్.. రైతులకు కీలక సూచన!
దిశ, జన్నారం : యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి రైతులకు సూచించారు. జన్నారం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. యాసంగిలో వరి పంటను కొనుగోలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో తెలంగాణ గవర్నమెంట్ కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా లేనందున రైతులు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
వరికి బదులుగా మినుములు, మొక్కజొన్న, వేరుశనగ, పెసర తదితర పంటలు వేసుకోవాలని సూచించారు. ఒకవేళ వరి సాగు చేసుకుంటే రైతులే ఎక్కడైనా అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. వరి సాగుచేసి రైతులు ఇబ్బంది పడకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తహశీల్దార్ పుష్పలత, ఎంపీపీ సరోజన, ఎంపీడీవో అరుణ రాణి, మండల వ్యవసాయాధికారి సంగీత ఏఈఓలు త్రి సంధ్య అక్రమ్ తదితరులు రైతులు పాల్గొన్నారు.