నాణ్యత లేక.. ప్రారంభానికి ముందే బీటలు

by Shyam |
నాణ్యత లేక.. ప్రారంభానికి ముందే బీటలు
X

దిశ, మెదక్: తరతరాల పాటు చెక్కుచెదరకుండా ఉండాల్సిన నిర్మాణాలు ప్రారంభం కాకముందే పెచ్చులూడి, బీటలువారి కూలిపోతున్నాయి. దీంతో ఈ కట్టడాల నాణ్యతపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు ఏ మేరకు పాటించారో చూడగానే ఇట్టే స్పష్టమవుతోంది. సంగారెడ్డి జిల్లా కల్హర్ మండల కేంద్రంలో రూ.2.50లక్షలతో డంపింగ్, కంపోస్టు, షెడ్డు మంజూరు కాగా నిర్మాణం పూర్తయింది. అయితే అప్పుడే బీటలువారి కూలిపోతుండటంతో అధికారుల పనితీరుపై స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికారుల తప్పిదం వల్లనే షెడ్డు బీటలు వారుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Collapsing, dumping yard, walls, medak, Construction, sangareddy

Advertisement

Next Story

Most Viewed