- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మహద్ తాలుకా కేంద్రంలోని కాజల్ పురలో ఉన్న ఐదంతస్తుల భవనం సోమవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీస్తున్నారు. ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, ఆ భవనంలో మొత్తం 45 ప్లాట్లు ఉన్నాయని, ప్రాణనష్టం భారీగా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Next Story