- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్‌లో నేషనల్ హైవేపై కూలిన బ్రిడ్జి
by Anukaran |
X
దిశ, వర్ధన్నపేట: కోనారెడ్డి చెరువు గండి పడి వరుద నీరు వరంగల్-ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపైకి చేరడంతో గురువారం అర్ధరాత్రి వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు జాఫర్ గడ్ వెళ్లే రహదారి గుండా దమ్మన్నపేట గ్రామం మీదుగా ఖమ్మం హైవేకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 20 కిలోమీటర్ల అదనపు దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అధికారులు వంతెన కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. త్వరితగతిన పనులు చేపట్టాలని కలెక్టర్ హరిత ఆదేశించడంతో ప్రణాళికతో పనులు చేపట్టనున్నారు.
Advertisement
Next Story