- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ చేప ఐదేళ్లు ప్రెగ్నెంట్ ఉంటుందట!
దిశ, ఫీచర్స్: మనిషి పరిమాణం.. స్లో మూవింగ్.. లివ్ ఫాస్ట్ – డై యంగ్ మంత్రకు ఆపోజిట్‌గా జీవించిన డైనోసర్స్ కాలం నాటి చేపల గురించి సరికొత్త విషయాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. లివింగ్ ఫాజిల్ నిక్‌నేమ్‌తో పిలువబడే విచిత్రమైన ‘కోయిలకాంత్’ చేపలు 100 ఏళ్ల పాటు జీవించగలవని కొత్త అధ్యయనంలో తేలింది. 400 మిలియన్ ఏళ్ల క్రితం నివసించిన ఈ చేపల్లో ఆడ చేపలు 50 ఏళ్లు వచ్చేసరికి లింగ పరిపక్వత సాధిస్తే… మగ చేపలు 40-69 ఏళ్ల వయసు మధ్య సెక్సువల్ మెచ్యూరిటీ పొందుతాయని తెలుస్తోంది. మరో వింతైన విషయం ఏంటంటే ఇవి ఐదేళ్ల పాటు ప్రెగ్నెంట్ ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. 1938లో సౌతాఫ్రికా సమీపంలో ఈ చేపల ఆనవాళ్లు కనుగొన్న శాస్త్రవేత్తలు.. 20 ఏళ్ల పాటు జీవించగలవని అనుకున్నారు. కానీ డేటింగ్ కమర్షియల్ ఫిష్‌పై స్టాండర్డ్ టెక్నాలజీని అప్లై చేసిన థర్స్‌డేస్ కరెంట్ బయాలజీ స్టడీ.. వీటి లైఫ్ స్పాన్ వందేళ్లు ఉంటుందని నిర్ధారించింది.
కోలాకాంత్స్ అంతరించిపోతున్నందున శాస్త్రవేత్తలు ఇప్పటికే పట్టుబడిన, చనిపోయిన ఈ చేపల నమూనాలను అధ్యయనం చేయగలిగారు. కానీ గతంలో శాస్త్రవేత్తలు ఒక నిర్దిష్ట కోయిలకాంత్ స్కేల్‌లో బిగ్ లైన్స్ కౌంట్ చేయడం ద్వారా చేపల వయస్సును లెక్కించారు. కానీ పోలరైజ్డ్ లైట్ ఉపయోగించి మాత్రమే చూడగలిగే స్మాల్ లైన్స్‌ను గతంలో గుర్తించలేకపోయారని ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు తెలిపారు.